ఆలేరులో ఘనంగా మాజీ ప్రధాని ‘భారతరత్న’ శ్రీమతి ఇందిరా గాంధీ 105వ జయంతి వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మాజీ ప్రధాని ‘భారతరత్న’ శ్రీమతి ఇందిరా గాంధీ 105వ జయంతి వేడుకలు స్థానిక ఇందిరా కాంగ్రెస్ భవనంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కాంగ్రెస్ ఆలేరు పట్టణ అధ్యక్షులు యం.ఏ. ఎజాజ్ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ భారతదేశపు తొలి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా ఎంతో ప్రఖ్యాతిగాంచారని, ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసి అత్యుత్తమ సేవలు అందించారని అన్నారు. 1964 సంవత్సరములో తండ్రి జవహర్ లాల్ నెహ్రు మరణం తరువాత రాజ్యసభకు ఎన్నికైన ఇందిరాగాంధీ.. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసి అందరిచేత ప్రశంసలు అందుకున్నారన్న విషయాన్ని ఆయన…