పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోన్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’. ఈ సినిమా ద్వారా పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. దినేష్ బాబు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ ని ప్రేరణగా తీసుకొని, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న ‘డియర్ కృష్ణ’ చిత్రంలో యువ సంచలనం, ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఐశ్వర్య కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రచార చిత్రాలతో, లక్ష రూపాయల కాంటెస్ట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘డియర్ కృష్ణ’పై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, ఈ సినిమాకి…