నేను పవన్, ప్రభాస్ ఫ్యాన్…తెలుగులో విలన్ రోల్ చేయడానికి రెడీ:మిమో చక్రవర్తి ఇంటర్వ్యూ

I'm Pawan, Prabhas Fan...Ready To Do Villain Role In Telugu: Mimo Chakraborty Interview

‘నేనెక్కడున్నా’ సినిమాతో ప్రముఖ బాలీవుడ్ నటుడు – సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగు చిత్రసీమకు హీరోగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఎయిర్ టెల్ ఫేం సషా చెత్రి హీరోయిన్. కేబీఆర్‌ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన చిత్రమిది. మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ శుక్రవారం సినిమా విడుదల కానున్న సందర్భంగా మిమో చక్రవర్తి తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు… మిమో చక్రవర్తి గారు… వెల్కమ్ టు టాలీవుడ్! థాంక్యూ. ఫైనల్లీ ఫిబ్రవరి 28న ‘నేనెక్కడున్నా’ విడుదల కావడం సంతోషంగా ఉంది. నా చైల్డ్ హుడ్ అంతా సౌత్ మూవీస్ చూస్తూ గడిపా. ఊటీలో మా నాన్న గారికి (మిథున్ చక్రవర్తి)కి హోటల్ ఉంది. నేను అక్కడ ఉన్నాను. అందువల్ల, తెలుగు – తమిళ సినిమాలు చూస్తూ పెరిగా.  మీరు తెలుగు…