‘ఇద్దరి లోకం ఒకటే’ ప్రచార చిత్రం విడుదల

prasanna kumar launched the poster of iddari lokam okate

యువ ప్రతిభాశాలి ‘అయ్యప్ప’ను కథానాయకుడిగా మరియు దర్శకుడిగా పరిచయం చేస్తూ ఉమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ అంకం సమర్పణలో వై.ఉమాదేవి నిర్మించిన విభిన్న ప్రేమకథాచిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. అయ్యప్ప, అమృత పావని, దివ్య, శ్రీనివాస్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ రిలీజ్ చేయగా.. పోస్టర్‌ను యువ దర్శకులు జితేందర్-దర్శక నిర్మాత శివనాగు సంయుక్తంగా ఆవిష్కరించి ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్ర బృందానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. పెద్ద మనసుతో తమ చిన్న చిత్రాన్ని ప్రోత్సహిస్తున్న అతిథులకు చిత్ర దర్శకుడు-కథానాయకుడు అయ్యప్ప కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్లు అమృత పావని, దివ్య, శ్రీనివాస్, వంశీ పవన్, ఈశ్వరరావు వానపల్లి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్,…