‘శుభం’పై నాకు ఎంతో నమ్మకం ఉంది.. సినిమా చాలా బాగా వచ్చింది : సమంత

I have a lot of faith in ‘Shubham’.. The film turned out very well: Samantha

ప్రముఖ నటి సమంత నిర్మాతగా ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం ‘శుభం’. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు సమంత మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే.. * నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది నాకు మొదటి శుక్రవారం. ఎంతో నర్వెస్‌గా ఉన్నాను. నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. గత వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ టీం, మిక్సింగ్ టీం, ఎడిటింగ్ ఇలా అందరూ నిద్ర లేకుండా పని చేస్తున్నారు.…