మా నాన్నగారిలా నేనూ తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉంది – ‘నేనెక్కడున్నా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మిమో చక్రవర్తి

Like my father, I am happy to do a Telugu film - Mimo Chakraborty at 'Nenekkadunna' pre-release event

ప్రముఖ బాలీవుడ్ నటుడు, సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, ఎయిర్ టెల్ ఫేం సాషా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నేనెక్కడున్నా’. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గంగాధర్, గోపీనాధ్ రెడ్డితో పాటు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. వీవీ వినాయక్, బ్రహ్మజీ, ప్రేమ్ రక్షిత్ వీడియో బైట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సివిల్ సర్వెంట్ గోపీనాథ్ రెడ్డి ఐఏఎస్ మాట్లాడుతూ.. ”నేనెక్కడున్నా’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చినందుకు హ్యాపీగా ఉంది. దర్శకుడు మాధవ్ ఈ సినిమా…