ప్రముఖ నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. సమంత నేతృత్వంలోని వస్తున్న తొలి చిత్రం ‘శుభం’. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మిస్తున్న ఈ చిత్రాన్నికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన ‘శుభం’ ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మేకర్స్ ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మొదటి సింగిల్ ‘జన్మ జన్మల బంధం’ను విడుదల చేశారు. ఇది ప్రమోషనల్ వైబ్ కోసం రూపొందించి ఓ ఎనర్జిటిక్ రీమిక్స్ పాట. నిర్మాతతో పాటు ప్రధాన తారాగణం ఈ ప్రమోషనల్ సాంగ్‌లో కనిపిస్తారు. ఈ సాంగ్‌లో సమంత అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నారు. టీం అంతా కూడా ఫుల్ వైబ్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రమోషనల్ సాంగ్…