హారర్-కామెడీ ‘శుభం’ ప్రమోషనల్ సాంగ్ ‘జన్మ జన్మల బంధం’ విడుదల

Horror-comedy ‘Shubham’ promotional song ‘Janma Janmala Bandham’ released
Horror-comedy ‘Shubham’ promotional song ‘Janma Janmala Bandham’ released
Spread the love

ప్రముఖ నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. సమంత నేతృత్వంలోని వస్తున్న తొలి చిత్రం ‘శుభం’. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మిస్తున్న ఈ చిత్రాన్నికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన ‘శుభం’ ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మేకర్స్ ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మొదటి సింగిల్ ‘జన్మ జన్మల బంధం’ను విడుదల చేశారు.
ఇది ప్రమోషనల్ వైబ్ కోసం రూపొందించి ఓ ఎనర్జిటిక్ రీమిక్స్ పాట. నిర్మాతతో పాటు ప్రధాన తారాగణం ఈ ప్రమోషనల్ సాంగ్‌లో కనిపిస్తారు. ఈ సాంగ్‌లో సమంత అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నారు. టీం అంతా కూడా ఫుల్ వైబ్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రమోషనల్ సాంగ్ బీట్ చాలా హుషారుగా ఉంది.
నవ్వు, భయం ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను ‘శుభం’లో పొందు పర్చారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ వంటి వారు నటించారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోన్న ‘శుభం’ ఈ వేసవికి ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరిచే చిత్రం కానుంది.