సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ బుల్లితెర, వెండి తెర రెండింటిలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అతని కొత్త చిత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోర్ట్ సినిమాలో తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్న శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి హైలెస్సో అనే ఆకట్టుకునే టైటిల్ పెట్టారు. ఇది పల్లె వాతావరణంలో తరచూ వినిపించే మాట నుంచి తీసుకోవడం విశేషం. టైటిల్ లోగోను ఓడ ఆకారంలో డిజైన్ చేసి ‘S’ అక్షరాన్ని మహిళా కాలు ఆకారంలో చూపించారు. చేతిలో…
