న్యాచురల్ స్టార్ అన్న పేరుకు తగ్గట్టే నాని నటన చాలా సహజంగా ఉంటుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రల్లో ఆయన ఇట్టే ఒదిగిపోతారు. రొమాంటిక్ సినిమాల్లో నటన తోటి యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి ఆయన ‘దసరా’ సినిమాలో ఊర మాస్ లుక్‌లో కనిపించారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. నాని లుక్‌కు, నటనకు మంచి పేరొచ్చింది. నాని తాజాగా ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వటంలో ముందుండే కథానాయకుడు నాని. మరోసారి ఈ సినిమాతో శౌర్యవ్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. శౌర్యవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని పాత లుక్‌లో కనిపించారు. మరి, కెరీర్‌లో ఎక్కువ విజయాలు తెచ్చిన పెట్టిన జోనర్‌లో నాని సక్సెస్…