క్లాసిక్ సినీ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సుదిక్షా,సునీత,, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర హీరో వెంకన్న తిరుమల వెంకటేశ్వర స్వామినీ దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి ఆశీస్సులతో అక్టోబర్ 27 న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా.. చిత్ర హీరో వెంకన్న మాట్లాడుతూ… మా “ఒక్కడే 1” సినిమా తొలి కాపీ సిద్ధమైంది. సినిమా పరిశ్రమ ఎందరో కొత్త వారిని అక్కున చేర్చుకుంది. ఆ కోవలోనే నేను హీరోగా నటించిన మా చిత్రం ప్రేక్షకులకు కావలసిన సర్వ హంగులతో రూపుదిద్దుకుంది. నాకు పోలీస్ ఆఫీసర్ కావాలని చాలా బలమైన కోరిక ఉండేది.…