ప్రస్తుతం తెలుగు చిత్రాలకు బాలీవుడ్ లో సూపర్ మార్కెట్ ఏర్పడింది. మన టాలీవుడ్ హీరోలు గతంలో నటించిన చిత్రాలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ అందుకుంటున్నవిషయం తెలిసిందే. దాంతో తెలుగు హీరోలు అక్కడ బాగా పాపులర్ అయిపోతున్నారు. సౌత్ నుంచి నార్త్ కు వెళ్తున్న సినిమాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. హ్యాండ్ సమ్ హీరోస్ లిస్ట్ విషయానికొస్తే ఇండియాలోనే టాప్ 5లో లిస్ట్ లో మహేశ్ బాబు పేరు కూడా ఉంటుంది. కేవలం టాలీవుడ్ చిత్రాలతోనే కాదు.. బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు సూపర్ స్టార్. అందుకే ఉత్తరాదిన చాలా మంది హీరోయిన్స్ మహేశ్‌తో…