‘హరిహరవీరమల్లు’ జూన్‌ 12న విడుదల

'Hari Hara Veera Mallu' to release on June 12th

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. అన్ని అడ్డంకులను దాటుకొని జూన్‌ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాకు సంబంధించిన మొత్తం షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం పాన్‌ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పెద్దఎత్తున విడుదల కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ దీని డిజిటల్‌ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ‘హరి హర వీరమల్లు’ సినిమా గత కొన్నేళ్లుగా ఆలస్యమవుతూ వచ్చింది. హీరో పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ నిరవధికంగా ఆగిపోవడంతో ఆలస్యం అయ్యింది. కానీ ఎట్టకేలకు పవన్‌ కళ్యాణ్‌ సినిమా షూటింగ్‌ లో…