తెలంగాణ గద్దర్‌ అవార్డుల వేడుక గ్రాండ్‌ సక్సెస్‌ అవ్వడం సంతోషానిచ్చింది: ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ‘దిల్’ రాజు

Happy that the Telangana Gaddar Awards ceremony was a grand success: FDC Chairman 'Dil' Raju

తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రధానోత్సవం శనివారం హైటెక్స్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు కృతజ్క్షతలు తెలియజేయగానికి ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు, ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌ ఐఏఎస్‌లు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌ గారు మాట్లాడుతూ ”గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారి ఆదేశాలతో.. సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారి గైడెన్స్‌తో, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు గారి ఓవరాల్‌ సూపర్‌విజన్‌లో సక్సెస్‌ఫుల్‌గా తెలంగాణ గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను నిర్వహించుకున్నాం. అవార్డ్‌ వేడుకకు సక్సెస్‌కు కారణమైన ప్రతి ఒక్కరికి, సినీ అభిమానులకు, సినీ పరిశ్రమకు నా కృతజ్క్షతలు అని తెలిపారు. దిల్‌ రాజు మాట్లాడుతూ ” తెలంగాణ…