అలీ..రెండక్షరాల ఈ పేరు వినిపించగానే పెదాలు రెండు విడిపోయి గుండెలోతుల్లో నుండి నవ్వు ఆటోమేటిగ్గా తన్నుకొస్తుంది..1981లో బాలనటునిగా తెలుగు సినిమా ఎంట్రీఇచ్చారు. 28ఏళ్ల క్రితం 1994లో యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యమలీల’తో హీరోగా మారారు. హీరోగా అనేక సినిమాల్లో నటించిన అలీ తర్వాత బుల్లితెర యాంకర్‌గా మారి ‘అలీ 369’, ‘అలీతో జాలీగా’, ‘అలీతో సరదాగా’ అంటూ ప్రతి తెలుగు ప్రేక్షకుని ఇంటికి వచ్చి అందరివాడయ్యాడు. ప్రముఖ యూనివర్సిటీల నుండి డాక్టరేట్ అందుకుని డాక్టర్ అలీ అయ్యారు. అక్టోబర్ 10 అలీ పుట్టినరోజు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ–‘‘ ‘‘ గత 43 ఏళ్లుగా సినిమా రంగంలో ఉంటూ ఎందరో దర్శకులు, నిర్మాతలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ప్రస్తుతం ‘ గీతాంజలి–2’, అల్లు శిరీష్ హీరోగా నటిస్తోన్న ‘ బడ్డీ’, ‘ మిస్ కాళికా…