టాలీవుడ్లో తెలుగు హీరోయిన్లు కొరవడిన సమయంలో అందం, అభినయంతో తన నటనాప్రతిభను కనబరుస్తూ ప్రేక్షకుల చూపులను తనవైపు తిప్పుకున్న అచ్చతెలుగు కుందనపు బొమ్మ హీరోయిన్ అనన్య నాగళ్ల. చేసింది తక్కువ సినిమాలే అయినా విశేష ప్రేక్షకాదరణను సంపాదించుకుంది. అంతేకాదు అనన్యకు సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. దాదాపు తన ఇనిస్టాగ్రామ్ లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ తో నిత్యం తన ఇష్టాఇష్టాలతో పాటు అదిరిపోయే పిక్స్ తో, రీల్స్ తో అలరిస్తుంది. పరిశ్రమకు వచ్చి కొంత కాలమే అయిన తన డ్రీమ్ కమ్ ట్రూ అయిన పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్న ఈ అపురూప పారిజాతం అనన్య నాగళ్ల పుట్టిన రోజు సందర్భంగా తన గురించి, అలాగే తాను చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం… ఖమ్మం జిల్లా…