జి.వి ప్రకాష్ కుమార్-ఐశ్వర్య రాజేష్ ‘డియర్’ షూటింగ్ పూర్తి

GV Prakash Kumar-Aishwarya Rajesh 'Dear' shooting complete

జి.వి ప్రకాష్ కుమార్-ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న “డియర్” చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ‘డియర్’ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చినప్పటినుంచి అంచనాలు పెరిగాయి. దానికి కారణం ‘మ్యూజికల్ కింగ్’ జి.వి. ప్రకాష్ కుమార్, అద్భుతమైన నటి ఐశ్వర్య రాజేష్ తొలిసారి కలసి నటించడం. నట్ మెగ్ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ తిరిపురేణి, అభిషేక్ రామ్ శెట్టి, పృథ్వీరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘సేతుమ్ ఆయిరమ్ పొన్’ఫేం ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన స్క్రిప్ట్‌ను రూపొందించడంలో ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వ ప్రావీణ్యం, మంచి ఎగ్జిక్యూషన్ పట్ల నిర్మాతలు సంతోషంగా వున్నారు. ప్రీప్రొడక్షన్ దశలోనే అనుకున్న ప్రకారం కేవలం 35 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తయింది. ‘డియర్’ చిత్రాన్ని…