‘గుర్తుందా శీతాకాలం’ ప్రతి ఒక్కరి టీనేజ్ ప్రేమలను గుర్తుకు తెస్తుంది : ప్రి రిలీజ్ ఈవెంట్ హీరో సత్య దేవ్.

gurthundaseethakalam movie pre relese event

టాలెంటెడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా  న‌టించిన  సినిమా ‘గుర్తుందా శీతాకాలం”. క‌న్న‌డ‌లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు మ‌రియు న‌టుడు నాగ‌శేఖ‌ర్ ని తెలుగుకి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్ మరియు మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌ మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని చిన‌బాబు, ఎం, సుబ్బారెడ్ది లు స‌మ‌ర్సించ‌గా కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు,  చిత్రాన్ని డిసెంబ‌ర్ 9 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత సి. కళ్యాణ్, హీరో అడవి శేష్, డైరెక్టర్ సతీష్…