▪️ మేనిఫెస్టో విడుదల చేసిన జీఎస్ హరి ప్యానెల్ ▪️ ఈ నెల 31న AATT ఎన్నికలు తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు అసోషియేషన్ (Artists Association of Telugu Television (AATT) కార్యవర్గం ఎన్నికలు ఈ నెల 31న జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఫిలించాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో జీఎస్ హరి ప్యానెల్ సభ్యులు మేనిఫెస్టో విడుదల చేశారు. తమ జీఎస్ హరి ప్యానెల్ గెలిస్తే.. తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులకు పలు ప్రయోజనాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో : 1. ఒక్కో తెలుగు సీరియల్‌లో ఒక్క పర భాష ఆర్టిస్ట్ కి మాత్రమే అనుమతి 2. వీక్లీ షూటింగ్ డేట్స్ బ్లాకింగ్ పద్దతిని నిర్మాతలు, ఛానల్స్‌తో మాట్లాడి రద్దు చేస్తాం 3.అర్హులైన పేద కళాకారులకు పెన్షన్‌లు…