మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వేగం చూస్తుంటే, సంక్రాంతికి అనుకున్న తేదీకి మహేష్ బాబు సినిమా విడుదల అవొచ్చు అని అంటున్నారు. అంత వేగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్నారని ఒక టాక్ నడుస్తోంది. చాలామంది కాంబినేషన్ నటులు వున్నా, అందరికీ ముందే చెప్పి పెట్టుకొని ఈ సినిమా షూటింగ్ కోసం మూడు హౌస్ సెట్లు వేశారని, ఎవరు దొరికితే ఆ సంబంధిత ఇంట్లో షూటింగ్ చేస్తున్నారని తెలిసింది. కథానాయకుడు అయిన మహేష్ బాబు హౌస్ సెట్, అలాగే ప్రకాష్ రాజ్ ఆఫీస్ సెట్, ఇంకోటి కథానాయిక అయిన శ్రీలీల హౌస్ సెట్ ఇలా మూడు సెట్లు వేశారని, కాంబినేషన్ చూసుకుంటూ చక చకా షూటింగ్ చేసేస్తున్నారని కూడా తెలిసింది. ఇందులో ప్రకాష్…