హారర్ కామెడీ జోనర్‌లో అంజలి ప్రధాన పాత్రధారిగా నటించిన బ్లాక్‌బస్టర్ `గీతాంజలి`ను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్‌లో గీతాంజలి మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ గీతాంజలి సీక్వెల్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అచ్చ తెలుగు అమ్మాయి అంజలి నటిస్తోన్న 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో హ్యూజ్ రేంజ్ మూవీగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని మేకర్స్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.…