గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలను నిర్మించి నిర్మాత దిల్‌రాజు. ఈ సంక్రాంతి సందర్బంగా గేమ్ చేంజర్‌ను జనవరి 10న, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా.. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అలా జరగటానికి కారణం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌గారు. మేం అడగ్గానే ఈవెంట్‌కు రావటం ఆనందంగా అనిపించింది. నా లైఫ్‌లోనే అద్భుతమైన ఈవెంట్ అది. మెగాభిమానులు, జన సేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్‌గారి అభిమానులు అందరూ సపోర్ట్ చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి వస్తోన్న సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోస్‌కు అనుమతులు ఇవ్వటం, టికెట్ రేట్స్…