బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులో రాంచరణ్ తో గేమ్ ఛేంజర్‌లో నటిస్తోన్నది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి కియారా అద్వానీ ఇటీవలే ఓ ఇంట్రెస్టింగ్ చెప్పి.. మూవీ లవర్స్‌లో జోష్ నింపింది. టీం అంతా కలిసి ఈ సినిమాను రెండేళ్ల నుంచి షూట్ చేస్తుంది. 2023 చివరికల్లా సినిమా పూర్తవుతుందని చిత్రయూనిట్ ఆశిస్తోంది. రాంచరణ్ తనకు ప్రియమైన స్నేహితుడని, శంకర్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. గేమ్ ఛేంజర్ చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమా కోసం నా వేళ్లు వంకర పోయాయంటే అర్థం చేసుకోండి. ప్రతీ ఒక్కరి అంచనాలకు మించి సినిమా ఉంటుంది. మేమంతా అహర్నిశలు చెమటోడ్చి పనిచేశామంటూ చెప్పుకొచ్చింది. ఈ ఒక్క అప్‌డేట్‌తో సినిమా కోసం ఎదురుచూస్తున్న…