హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…ఆదివారం నాడు హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో మెంబర్లకు ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సిటీ న్యూరో సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ జరిగింది. అవసరమైన వారికి ఫ్రీ మెడికేషన్ కూడా అందించారు. ప్రముఖ న్యూరాలజిస్టులు, ఆర్థోపెడిషన్లు, పలమనాలజిస్టులు, గైనకాలజిస్ట్లు, కార్డియాలజిస్టులు, పర్మనాలజిస్టులతో పాటు డెంటల్, ఐ చెకప్స్ వంటివి నిర్వహించారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ మెంబర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ లో తమ ఆరోగ్య పరీక్షలు జరుపుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సెక్రటరీ తుమ్మల రంగారావు, కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు.
Tag: Free Health Camp at Film Nagar Cultural Center
Free Health Camp at Film Nagar Cultural Center
On Sunday, a free health camp was held for members at the Film Nagar Center in Hyderabad. The camp was conducted from 8:30 AM to 3 PM under the supervision of the City Neuro Center. Free medication was also provided to those in need. Prominent neurologists, orthopedists, pulmonologists, gynecologists, and cardiologists, along with dental and eye check-ups, were also available. Members of the Film Nagar Cultural Center, along with their family members, participated in this free health camp to get their health check-ups done. In this program, Film Nagar Cultural…