by -షేక్ వహీద్ పాషా, సీనియర్ జర్నలిస్ట్ -9848787917 ధరల నేపథ్యంలో పండగలకు కళ తప్పింది. అన్ని పండగల్లాగే దీపావళి కూడా ఇంటికే పరిమితం కానుంది. బాణాసంచా కాల్చితేనే దీపావళి కాదు. అయితే దీపావళి ప్రత్యేకతే వేరు. అయితే బాణాసంచా ధరలు కూడా విపరీతంగగా పెరిగాయి. దీపాలతో ఇల్లంతా వెలగించి కొత్త కాంతులను ఆహ్వానించడం ద్వారా పండగ జరుపుకోవాలి. అలాగే ధరలు దాడి చేస్తున్న వేళ కలసి పండగ జరుపుకోవాలని, బాణాసంచా కాల్చాలన్న ఆలోచన నుంచి బయటకు రావాలి. దీపావళి రోజు దీపాలు వెలిగించి, లక్ష్మీపూజలతో, ఇంటి పిండి వంటలకే ప్రాధాన్యం ఇస్తూ పండగ జరుపుకోవడం ఉత్తమం. ఏటా దీపావళి పర్వదినాన్ని పిల్లాపెద్దలు కసలి ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చెడుపై మంచి గెలుపునకు చిహ్నంగా దీపాల పండుగను జరుపుకొంటారు. దీపాల పండుగ వేడుకలకు ప్రజలు…