తుది దశకు చేరుకున్న ‘7G బృందావన కాలనీ 2’ చిత్రీకరణ!

Filming of '7G Vrindavan Colony 2' has reached its final stage!

దక్షిణ భాషా చిత్రాలలో కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిన వాటిలో ‘7G బృందావన కాలనీ’ చిత్రం ఒకటి. సినిమా విడుదలై రెండు దశాబ్దాలవుతున్నా, ఇప్పటికీ ఎందరికో అభిమాన చిత్రంగా ఉంది. అలాంటి కల్ట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ గా ‘7G బృందావన కాలనీ 2’ రూపొందుతోంది. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై పలు అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ చిత్రీకరణ తుది దశకు చేరుకుందని నూతన సంవత్సరం సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది. ‘7G బృందావన కాలనీ 2’ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. కట్టిపడేసే కథాకథనాలు, హత్తుకునే భావోద్వేగాలతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించేలా అద్భుతంగా ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.…