ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఎప్పుడూ తమ అనుబంధ సంస్థేనని, దశాబ్దాలుగా ఆ సంస్థ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లోనే కొనసాగుతోందని, ఇక ముందు కూడా కొనసాగుతుందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అధ్యక్షులు విరాహత్ ఆలీ స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లోని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌కు చెందిన కార్యాలయాన్ని తిరిగి తమకు స్వాధీనం చేయాలని ఫిలిం క్రిటిక్స్ అసొసియేషన్ అధ్యక్షులు సురేష్ కొండేటి సారధ్యంలో శనివారం మధ్యాహ్నం టియుడబ్ల్యుజే అధ్యక్షులు విరాహత్ ఆలీని వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన్ను శాలువా, పూలబొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు లక్ష్మణరావు గారు మాట్లాడుతూ… ఎన్నో దశాబ్దాలుగా ఇదే బిల్డింగ్ కేంద్రంగా మా సంస్థ నడుస్తోంది. ఇటీవల కొంత రాకపోకలు నెమ్మదించడం కరెక్టే. అయితే ఇక నుంచి రెగ్యులర్‌గా మా…