టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్ సినిమాల విషయంలో దూకుడు చూపిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఇయర్ సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా, బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’గా వచ్చి మంచి విజయాలను అందుకున్నారు. రెండు సినిమాలు ఒక రోజు తేడాతో వచ్చి ప్రేక్షకులని అలరించాయి. సంక్రాంతి సీజన్ కాబట్టి ఈ సినిమాలు రెండు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాల తర్వాత చిరు ‘భోళా శంకర్’, బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాలు చేశారు. ‘భోళా శంకర్’ సినిమా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కింది. తమిళ సినిమా ‘వేదాళం’ను రీమేక్ చేస్తూ చిరు చేసిన ఈ ప్రయత్నం అంతగా మెప్పించలేదు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ని కొన్ని పోర్షన్స్ లో సాటిస్ఫై చేసినా, ఆడియన్స్ మాత్రం సినిమాను చూసి పెదవి విరుస్తున్నారు. మెహర్…