* ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ కు ఆద్యుడు ఎన్. టి. ఆర్. : కె.ఎస్.రామారావు ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ ఇవ్వాళ దేశంలోనే ఇంత ప్రతిష్టాత్మకంగా ఉన్నదంటే అందుకు ఆద్యులు నందమూరి తారక రామారావు గారేనని అధ్యక్షులు కె. ఎస్. రామారావు తెలిపారు. 2024 – 25 సంవత్సరాలకు ఎఫ్. ఎన్. సి. సి అధ్యక్షులుగా ఎన్నికైన కె. ఎస్. రామారావు ను ఎన్. టి. ఆర్. శత జయంతి కమిటీ సత్కరించింది. ఈ సందర్భంగా కె. ఎస్. రామారావు మాట్లాడుతూ.. 1995లో ఎన్. టి. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డి. వి. ఎస్. రాజు గారి ద్వారా మద్రాస్ లో స్థిరపడిన మా అందరినీ ఆహ్వానించారు. మద్రాసు నుంచి మా అందరినీ హైదరాబాద్ కు తరలి రమ్మన్నారు. అప్పుడు ఫిలిమ్ నగర్ లో…