సత్య దేవ్ హీరోగా ’47 డేస్’ అనే థ్రిల్లర్ ద్వారా దర్శకుడిగా పరిచయమయిన ప్రదీప్ మద్దాలి తన రెండో ప్రాజెక్ట్ గా ‘సర్వం శక్తి మయం’ అనే సిరీస్ కి దర్శకత్వం వహించారు. దీనికి కథను అందించిన బి.వి.ఎస్.రవి క్రియేటర్ గా వ్యవహరిస్తే, ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. ఆహా లో విడుదలయిన ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ శక్తి పీఠాలు.. హిందూమతంలోని విశిష్ఠతను తెలియజేసే విధంగా ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది. దసరా సందర్భంగా విడుదలైన ‘సర్వం శక్తి మయం’ విశేష ఆదరణతో ఓటిటిలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ మద్దాలి తన సంతోషాన్ని, అనుభవాలను పంచుకున్నారు…. మీ బ్యాక్ గ్రౌండ్ గురించి వివరించండి? – మాది రాజమండ్రి. నేను ఇంజినీరింగ్ అక్కడే చేశాను. ఆ తర్వాత ఐదేళ్లు ఐటి లో సి.ఎస్.సిలో టీం లీడ్ గా…