ఇటు మెగాభిమానులు, అటు సినీ ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తోన్న సమయం రానే వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు శంకర్ మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా లార్జర్ దేన్ లైఫ్ మూవీగా గేమ్ చేంజర్‌ను ఆవిష్కరించినట్లు సుస్పష్టంగా ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ విడుదల కావటం విశేషం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్,…