వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్పై రాజేష్ దండా నిర్మించారు. ఆనంది కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఒక నిజాయితీ గల సినిమా. మన చుట్టూ జరిగే కథ. సినిమా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు మోహన్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్, డీవోపీ రాంరెడ్డి, మాటల రచయిత అబ్బూరి రవి గారు.. టీం అంతా కలసి చాలా మంచి వర్క్ చేశాం. చివరి ఇరవై నిమిషాల్లో చాలా కీలకమైన యాక్షన్…