నవీన్ చంద్ర హీరోగా నటించిన ‘ఎలెవన్’ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. విడుదలైన ప్రచార చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా ఇది తెరకెక్కింది. కథ: విశాఖపట్నంలో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తాయి. బాధితులను గుర్తించలేని స్థితిలో పోలీసులు తలలు పట్టుకుంటారు. ఈ కేసును డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ శశాంక్‌కు ప్రమాదం జరగడంతో, ఏసీపీ అరవింద్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. అరవింద్ రంగంలోకి దిగిన కూడా హత్యలు ఆగవు. హంతకుడితో పాటు హత్యకు గురైన వారి ఆనవాళ్లు కూడా దొరకవు. సవాలుగా మారిన ఈ కేసులో చివరకు ఓ చిన్న ఆధారం లభిస్తుంది. అయితే ఈ క్లూతో నేరస్థుడిని అరవింద్ ఎలా పట్టుకున్నాడు. నేరస్థుడికి ఎవరు సహాయం చేశారు? అసలు ఆ సైకో…