కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ హీరోగా నటించిన చిత్రం డ్రింకర్ సాయి. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రంలో డ్రింకర్ సాయిగా హీరో ధర్మ నటనకు ప్రేక్షకులు ఫీదా అవుతున్నారు. సినిమా కంటెంట్ తగ్గట్టుగానే హీరో తాగుబోతుగా కనిపించిన తీరు అందరినీ కట్టిపడిస్తోంది. ధర్మ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. లవ్, ఎమోషన్స్, డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో ధర్మ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. సినిమాలో ధర్మ ఇంట్రడక్షనే చాలా మాస్సివ్ గా ఉంది. ఇది మాస్ ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. అలాగే…