ప్రణవచంద్ర, మాళవిక సతీషన్,మాస్టర్ చక్రి ..అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి ప్రణవి సాధనాల టార్జాన్ జెమిని సురేష్ ముఖ్యపాత్రల్లో.కోట శ్రీనివాసరావు తనికెళ్ళ భరణి బెనర్జీ అతిధి పాత్రలలో నటించిన చిత్రం ‘‘దోచేవారెవురా’’. ఐక్యూ క్రియేషన్స్ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంలోని ‘‘సుక్కు,సుక్కు ….’’ సాంగ్‌ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. సిరాశ్రీ సాహిత్యం అందించారు. సుకుమార్ మాట్లాడుతూ–‘‘ ఒకసారి దర్శకుడు అయిన తర్వాత ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూండాలి అనుకుంటారు. అందుకే శివనగేశ్వరరావుగారు వన్స్‌మోర్ అని ఒక యూట్యూబ్ చానల్ పెట్టారు. అందులో ఆయన అనుభవాలను ఒక్క అబద్దం కూడా లేకుండా చాలా సిన్సియర్‌గా మాట్లాడతారు. అజయ్‌ఘోష్ చాలా మంచి ఆర్టిస్ట్. సినిమా పరిశ్రమకు ఆయన లేటుగా పరిచయమయ్యారేమో అనిపిస్తుంది నాకు. నేను విడుదల చేసిన రెండోపాటలో సుక్కు, సుక్కు అనే సౌండ్ నాకు బాగా…