తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే తొలి ప్రయత్నంగా, దేశముదురు హీరోయిన్ హన్సిక మోత్వాని లీడ్ రోల్ గా “105 మినిట్స్” అనే సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ మూవీతో ఒక వినూత్న ప్రయోగం చేసిన దర్శకుడు రాజా దుస్సా, ఇప్పుడు తన తదుపరి చిత్రంగా తెలంగాణ యాస భాష నేపథ్యంలో ” అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే ” అంటూ పూర్తి వినోదాత్మకమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని ” శ్రీ రామకృష్ణ సినిమా ” బ్యానర్ లో గాలి కృష్ణ గారు నిర్మిస్తున్నారు. సహ నిర్మాతలుగా నాంపల్లి సోమాచారి, అలూరి రాజిరెడ్డి , రూప కిరణ్ గంజి గారు వ్యవహరిస్తున్నారు. ఈ కథ విషయానికి వస్తే 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరంగల్ జిల్లాలో జరిగిన ఒక యదార్థ సంఘటనను…