జియోహాట్‌స్టార్, డిస్నీ+ హాట్‌స్టార్ నుంచి జియో హాట్ స్టార్‌గా పున: నిర్మితమై ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తిరుగులేని, బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న సంగతి తెలిసిందే.తాజాగా హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా, ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘దేవిక అండ్ డానీ’ అనే వెబ్ సిరీస్‌ను జూన్6 నుంచి అందిస్తుంది. ఈ వెబ్‌సిరీస్‌లో రీతూ వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. బి.కిషోర్ దర్శకత్వంలో సుధాకర్ చాగంటి దీన్ని నిర్మించారు. జూన్6 నుంచి ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో… హీరోయిన్ రీతూవర్మ మాట్లాడుతూ ‘‘వెబ్ సిరీస్ చేయాలని…
