వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘డెకాయిట్’ తో అలరించబోతున్నారు. షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ లవ్, యాక్షన్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. శేష్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసిన తర్వాత, మేకర్స్ మరో అద్భుతమైన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ లవ్ స్టొరీ, రూత్ లెస్ జర్నీ, ఒక పెద్ద లక్ష్యంతో నడిచే హీరోని ప్రజెంట్ చేస్తోంది. ప్రేమ, దోపిడీ ఈ రెండు ప్రధాన అంశాల చుట్టూ కథనం అద్భుతంగా వుంది. మొదటిసారిగా మాస్-ఓరియెంటెడ్ పాత్రలో కనిపించిన అడివి శేష్ అదరగొట్టారు. క్యారెక్టర్ మల్టీ షేడ్స్‌తో ఆకట్టుకుంది. శేష్ రగ్గడ్ అవతార్‌లో కనిపించిన తీరు అదిరిపోయింది. మదనపల్లె యాసలో మాట్లాడిన…
