సమాజం స్వార్ధపూరితం! కలుషితమయం! అయినా కొందరు మాత్రం ఇంకా విలువలను కాపాడుతూ అక్కడక్కడా ఉన్నారు! అందులో మా జమలాపురం రాధాకృష్ణ గురించి కొంచెం చెప్పుకోవాలి! ఆయన గురించి ఆయన ఆలోచిస్తారో లేదో కానీ, స్నేహం కోసం మాత్రం సొంత పనులకు కూడా బ్రేక్ వేసి సమయం ఇస్తారు! ఎదుటివారు స్వార్ధంగా ఆలోచించినా ఆయన మాత్రం స్వచ్ఛంగా ప్రేమిస్తారు! ఆయనకు సంస్కృతీ, సంప్రదాయాలు చాలా ఇష్టం! సాంస్కృతిక కార్యక్రమం ఉందని ఆహ్వానిస్తే ఎంత దూరం భారం అయినా సొంత ఖర్చుతో వచ్చేస్తారు! వస్తూ వస్తూ మరో నలుగురిని కారులో తీసుకొచ్చి వారికి సంతోషాన్ని కలిగిస్తారు! సాంస్కృతిక ప్రదర్శనలు చూడటానికి కూడా అదృష్టం ఉండాలంటారు! అంత ఇష్టం ఆయనకు! కారులో లాంగ్ డ్రైవింగ్ చేయడం ఆయనకు యమ ఇష్టం! ఆత్మీయ మిత్రులు దూర ప్రాంతాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి వెళ్లాలన్న…