చిత్రపరిశ్రమ అభివృద్ధికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు మనమంతా కలసి పనిచేద్దాం రండి.. తెలంగాణ అభివృద్దిలో విూరూ భాగస్వాములు కండి విూపై సామాజిక బాధ్యత ఉందని గుర్తించండి డ్రగ్స్ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి సిఎం రేవంత్ రెడ్డి వెల్లడి ప్రభుత్వంతో కలసి పనిచేస్తామన్న ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు కలసి పనిచేద్దాం రండి..తెలంగాణ అభివృద్దిలో విూరూ భాగస్వాములు కండి అని సిఎం రేవంత్ రెడ్డి చిత్రపరిశ్రమను ఆహ్వానించారు. సినీ పరిశ్రమలో సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆయన సూచనలు చేశారు. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుంది.…