బాబీ దర్శకత్వంలో చిరంజీవి రవితేజ నటించిన చిత్రం ’వాల్తేరు వీరయ్య’ సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా… చిత్రబృందమంతా వేడుక చేసుకుంది. ఈ సందర్భంగా మైకందుకున్న మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును… ప్రత్యేకంగా ఎవరినైనా ఉద్దేశించి అంటున్నారనే విషయంలో పూర్తి స్పష్టత లేనప్పటికీ… తాజాగా ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా…యాక్టర్ల రెమ్యూనరేషన్ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ`ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలని చిరంజీవిఅన్నారు. ఇదే సమయంలో… పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి.. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి? అని చిరంజీవి స్పందించారు. అనంతరం ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర విజయం…