‘చెప్పినా ఎవరూ నమ్మరు’కి యంగ్ హీరో సపోర్ట్

vishwak sen launches cheppina evaru nammaru 1st look

శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ లో నూతనంగా నిర్మిస్తున్న చిత్రం “చెప్పినా ఎవరూ నమ్మరు” పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని లాక్డౌన్ తరువాత థియేటర్లలో ఈచిత్రాన్ని మొదటి చిత్రంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ లో భాగంగా మొదటి సారిగా నేటి యువతరం హీరోల్లో విజయపథంలో దూసుకెళ్తు ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విస్వక్ షేన్ “చెప్పినా ఎవరూ నమ్మరు” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి… ఈ సినిమా మంచి విజయం సాధించి… అందరికి గుర్తింపు రావాలని చిత్ర యూనిట్‌ను అభినందించారు. చిత్ర నిర్మాత డాక్టర్ ఎం. మురళి శ్రీనివాసులు మాట్లాడుతూ… ” ముందుగా అడిగిన వెంటనే మా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించిన…