నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న కోర్టు డ్రామా కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జి. శంకర్, ఎల్. మధు నిర్మించిన చిత్రం ఉద్వేగం. ఈ కోర్టు డ్రామాకు మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. త్రిగున్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో దీప్సిక కథానాయికగా నటించగా శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజయ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఈ చిత్రానికి కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించారు. 2021లో వచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత కోర్టు నేపథ్యంలో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అలాగే త్రిగున్ కి ఇది 25వ సినిమా కావడం మరో విశేషం. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘ఉద్వేగం’పై మంచి…