మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బి జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ నటుడు చిట్టి చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా….. ప్రముఖ కమెడియన్ అలీ మాట్లాడుతూ.. చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం…