ఆసక్తిని రేకెత్తించిన ‘బుట్ట బొమ్మ’ టీజర్!

buttabomma treser review

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘బుట్ట బొమ్మ’ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న చిత్రమిది. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు నాయిక, నాయకులుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌ నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయమవుతున్నారు. విడుదలైన ప్రచార చిత్రం ను పరికిస్తే….ఆద్యంతం ప్రతిక్షణం ఆకట్టుకుంటూ, ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రధాన పాత్రల తీరు తెన్నులు, అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల అభినయం ఆకట్టుకుంటుంది. “మళ్లీ ఎప్పుడు కాల్ చేస్తావ్… ఇంకోసారి చెయ్యాలంటే … ఇప్పుడు…