బాలీవుడ్‌కు బన్నీ ‘నో’ అంటున్నాడు!

Bunny says 'No' to Bollywood!

‘అల వైకుంఠపురం లో..’ సినిమాతో రికార్డు సృష్టించి.. ‘పుష్పతో ఏకంగా పాన్‌ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టి తిరుగులేని స్టార్‌గా ఎదిగాడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఇప్పుడు ఆయన సినిమా కోసం యావత్‌ సినీ లవర్స్‌ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల కిందట విడుదలైన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ఎలాంటి ప్రమోషన్‌లు లేకుండానే హిందీ బెల్ట్‌పై వంద కోట్ల బొమ్మతో నార్త్‌ ఆడియెన్స్‌తో జైజైలు కొట్టించుకున్నాడు. ప్రస్తుతం బన్నీ ’పుష్ప`2’తో బిజీగా ఉన్నాడు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌తో చేతులు కలుపుతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే చాన్స్‌ ఉంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా బన్నీ…