నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రంపై అల్లు అర్జున్ ప్రశంసలవర్షం కురిపించారు. మధురమైన చిత్రమని, మనసుకు హత్తుకుందని ఆయన కొనియాడారు. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఆయన వీక్షించారు. ఈ మేరకు చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ‘సోదరుడు నాని నటన అద్భుతం. ఆకర్షణీయమైన స్క్రిప్ట్ను వెలుగులోకి తెచ్చినందుకు టీమ్ విూద మరింత రెస్పెక్ట్ పెరిగింది. మృణాల్ నటన మనసుకు హత్తుకుంది. ఆ పాత్ర ఆమెకు లాగే బ్యూటిఫుల్‌గా ఉంది. మై డార్లింగ్ బేబీ కియారా.. నీ క్యూట్‌నెస్‌తో మనసుల్ని కరిగించేశావు. ఇక చాలు స్కూల్‌కి వెళ్లిపో. మిగిలిన ఆర్టిస్ట్‌లు కూడా ఎక్కడా పేరు పెట్టడానికి లేకుండా తమ ప్రతిభను చూపించారు. సాంకేతిక నిపుణుల అద్భుతమైన పని తెరపై కనిపిస్తోంది. ముఖ్యంగా కెమెరామెన్ సాను జాన…