హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ చిత్రంలో బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ తాత, మనవళ్ళుగా నటించారు. ఫస్ట్-టైమర్ ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్100% సక్సెస్ రేట్‌తో న్యూ ఏజ్ కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందిస్తోంది. వారి గత చిత్రాలు మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందించాయి. తాజాగా మరో యూనిక్ ఎంటర్ టైనర్ గా ‘బ్రహ్మా ఆనందం’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషించగా…