‘వ‌కీల్ సాబ్’ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘వ‌కీల్ సాబ్’ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ప‌వ‌న్‌కళ్యాణ్ పుట్టిన‌రోజు(సెప్టెంబ‌ర్ 2) సంద‌ర్భంగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఒక వైపు మ‌హాత్మాగాంధీ ఫొటో, మ‌రో వైపు అంబేద్క‌ర్ ఫొటో మ‌ధ్య ప‌వ‌న్ లాయ‌ర్ కోటు వేసుకుని నిల‌బడ్డారు. ఓ చేతిలో బేస్‌బాల్ స్టిక్‌, మ‌రో చేతిలో క్రిమిన‌ల్ లా అనే పుస్త‌కం ప‌ట్టుకుని ప‌వ‌న్ ఠీవిగా నిల‌బ‌డి ఉన్నలుక్‌తో ఉండేలా మోష‌న్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కాభిమానుల అంచ‌నాల‌ను మించేలా ఉంది. ఈ మోష‌న్ పోస్ట‌ర్ బ్యాగ్రౌండ్‌లో స‌త్య‌మేవ జ‌య‌తే…