రామ్‌ ‘స్కంధ’పై భారీ అంచనాలు… ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టిన మేకర్స్‌!

Big expectations on Ram's 'Skandha'... Makers focused on promotions!

వినాయక చవితికి నాలుగు రోజుల ముందే రిలీజవుతున్న ‘స్కంద’ సినిమాపై మాస్‌ ఆడియెన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి వైలెన్స్‌ ఈ సారి ఊహించిన దానికంటే అరివీర భయంకరంగా ఉండబోతుందని గ్లింప్స్‌, ట్రైలర్‌లు గట్రా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాయి. ఇక బీ, సీ సెంటర్లకు వచ్చే ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు కూడా చెప్పేశాయి. మరో రెండు వారాల్లో రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి. ఇక ఈ రెండు వారాల పాటు చిత్రయూనిట్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రమోషన్‌లు జరుపనుందట. పైగా పాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్‌ చేస్తుండటంతో అన్నీ భాషల్లో ప్రెస్‌మీట్‌లను నిర్వహించాలని మేకర్స్‌ గట్టి ప్లాన్ లే చేస్తున్నారట. ఇక ఈ సినిమాకు బిజినెస్‌ కూడా భారీ స్థాయిలోనే…